CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా మూడవ రోజు యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో యూఏఈ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పెంపొందించుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రస్తుతం భారత్, యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై నేతలు ప్రధానంగా చర్చించారు. పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించే అంశంపై దృష్టి పెట్టారు. సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యూఏఈ ఆర్థిక మంత్రి ఆసక్తి చూపారు.
Akhanda 2 Thaandavam: ఎలా నరుకుతానో నాకే తెలియదు కొడకా.. ఊహక్కూడా అందదు!
ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించేందుకు దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ తీసుకున్న చర్యలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్-దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు. ఆహార భద్రత (Food Security) అంశంపై ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి ఆసక్తి కనబరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూఏఈ మంత్రి లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై కూడా చర్చించారు.
world’s Biggest Party: ఈ దునియాలోనే అతి పెద్ద విందు.. 70 వేల మంది అతిథులు.. 10 రోజుల పార్టీ!