అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 5న థియేటర్లో విడుదల కాబోతున్న అఖండ 2 స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ ఈరోజు పంచుకుంది.
Also Read: Mega vs Allu Family: మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు?
‘బ్లాస్టింగ్ రోర్’ అంటూ అఖండ 2 యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. యాక్షన్ సీన్‌తో వీడియో మొదలైంది. ‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో, ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు కొడకా.. ఊహక్కూడా అందదు’ అని బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఎప్పటిలానే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫుల్ యాక్షన్, డైలాగ్ ఉన్న ఈ వీడియోను నందమూరి ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.