మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్‌ను సీఎం కొనియాడారు. చెడు నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారన్నారు. మంచి నాయకులకు చెడు నియోజకవర్గం ఇచ్చినా మంచి నియోజకవర్గంగా మార్చుతారని తెలిపారు. దీనికి ఉదాహరణ లోకేష్.. 2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని సూచించానని చెప్పారు. లేదు మంగళగిరిలో ఎప్పుడూ గెలవలేదు, అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారన్నారు. నెల ముందు నియోజకవర్గానికి వెళ్లారని.. తక్కువ మెజారిటీతో ఓడిపోయారన్నారు. ముందే వచ్చి ఉంటే గెలిచేవారని.. అయినా నియోజకవర్గంలో ఐదేళ్లు కష్టపడి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించారని కొనియాడారు. అది ఆయనకు ఉన్న పట్టుదల అని.. ఇప్పుడు గెలిచాక మళ్లీ జాగ్రత్తగా చూసకుంటున్నారన్నారు. మొదటిసారి గెలిచిన వాళ్లు కూడా ఈ విధంగానే పని చేయాలన్నారు.
READ MORE: Indigo Flight: హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..
మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది యువకులు ఉన్నారని.. తాను 9వ సారి ఎమ్మెల్యే అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. “మొదటి సారి గెలిచిన వాళ్లు వచ్చి ఏం చేయాలో నాకు చెప్తున్నారు. మీరు అలా చేయండి, ఇలా చేయండని అంటున్నారు. రాబోయే 30 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలని యువతకు అవకాశం ఇచ్చాను.. దాన్ని వినియోగించుకోండి. దేశంలో యంగెస్ట్ అసెంబ్లీ టీడీపీ. యంగెస్ట్ పార్లమెంట్ పార్టీ టీడీపీ. ఇటీవల అమిత్ షా కూడా అదే మాట అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పాపులర్ అవుతున్నారు.. మరికొంత మంది పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఈ విషయంలో మీకు మీరే సమర్థించుకుంటున్నారు. కార్యకర్తలతో ప్రజాప్రతినిధులు అనుసంధానం కావాలి. మన హైకమాండ్ వాళ్లే. స్థానికంగా సమర్థులనే ప్రోత్సహించాలి. మనం ఏం చేసినా ప్రజలు గమనిస్తారు. నేను ఇచ్చిన సూచనలు తీసుకుని పనితీరు మార్చుకుంటే ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారు. లేదంటే మీ ఇష్టం. అర్థం చేసుకుంటారనే స్పష్టంగా చెప్తున్నా. ఇక ఎవరిపట్లా మొహమాటం ఉండదు.” అని సీఎం స్పష్టం చేశారు.
READ MORE: Operation Sindoor: “భారత్ కొన్ని విమానాలు కోల్పోయింది”.. రక్షణ అధికారి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
