Citroen C3 CNG: సిట్రోయెన్ ఇండియా తాజాగా సిట్రోయెన్ C3కి డీలర్ ఫిటెడ్ CNG కిట్ వేరియంట్‌ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్‌తో C3 ధర రూ.93,000 పెరిగి రూ.7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)కి చేరింది. దేశంలో CNG ఇంధనానికి ఉన్న డిమాండ్, CNG స్టేషన్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం సిట్రోయెన్ భారతదేశపు పర్యావరణ హిత ఇంధన మార్గంలో భాగంగా చెప్పవచ్చు. C3 CNG వేరియంట్ 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్‌లో ఈ ఇంజిన్ 82 hp పవర్, 115 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. CNG మీద ఉన్న ప్రత్యేక పనితీరు వివరాలు ఇప్పటికీ ప్రకటించబడలేదు కానీ, ఈ వాహనం ARAI సర్టిఫైడ్ 28.1 కి.మీ/కి.జి ఇంధన సామర్ధ్యంతో వస్తోంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంది. CNG వెర్షన్ రైడ్ క్వాలిటీ పెట్రోల్ వేరియంట్‌తో సమానంగా ఉండేందుకు సిట్రోయెన్ రియర్ సస్పెన్షన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది.
Read Also: Virat Kohli-Bharat Ratna: కోహ్లీకి ‘భారతరత్న’ ఇవ్వాలి .. రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాల్సిందే..!
సిట్రోయెన్ ఈ CNG కిట్ ఇన్‌స్టాలేషన్ కోసం లొవాటో అనే ప్రముఖ CNG కిట్ తయారీదారునితో భాగస్వామ్యం ఏర్పరిచింది. ఈ కిట్‌లో 55 లీటర్ల నీటి సమాన సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో సుమారు 180 నుంచి 200 కి.మీ దూరం ప్రయాణం సాధ్యం అవుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా సిట్రోయెన్ C3 యజమానులు పనితీరు లేదా భద్రతలో తేడాలేకుండా సులభంగా తమ వాహనాలను CNGగా మార్చుకోగలుగుతారు.
Read Also: Fire Accident : పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి.. మృతుల్లో ఓ చిన్నారి..?
సిట్రోయెన్ C3 లైవ్, ఫీల్, ఫీల్(O), షైన్ అనే CNG నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు ధరలు రూ.7.16 లక్షల నుండి రూ.9.24 లక్షల వరకు ఉంటాయి. ఈ CNG వేరియంట్‌కు కూడా సిట్రోయెన్ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కి.మీ వారంటీని అందిస్తోంది. ఇది పెట్రోల్ మోడల్‌తో సమానమే.