CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CII Partnership Summit Day 2: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు కీలక ఒప్పందాలు జరిగాయి… దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సదస్సు ప్రాంగణంలో పెట్టుబడుల పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, కియా ఇండియా, గ్రీన్కో ఎనర్జీస్, మేఘా ఇంజినీరింగ్ వంటి ప్రముఖ సంస్థలు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలిరోజు మొత్తం 88 పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, 73 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.5,84,355 కోట్ల పెట్టుబడులు రానుండగా, 1,07,683 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక, రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలతో వరుసగా సమావేశం కానున్నారు. పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాల కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు. సదస్సు రెండో రోజు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి.
ఉదయం 10 గంటలకు కంపెనీలతో ఒప్పందాలు
రెండో రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కంపెనీలతో జరిగే ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ప్రముఖ జర్నలిస్టు పాల్కీ శర్మ నిర్వహించే ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. స్లోవాక్ రిపబ్లిక్ ఆర్థిక మంత్రి లాడిస్లావ్ కమెన్కీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే గ్వాటెమాలా విదేశీ వ్యవహారాల మంత్రి జూలియో ఎడురాడోతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించే అవకాశం ఉంది.
Also Read
- CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
- Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
- Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
- Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
అంతరిక్ష రంగ సంస్థల సీఈఓలతో భేటీ
స్పేస్ సెక్టార్‌కు సంబంధించి నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి స్కైరూట్, హాథర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థల సీఈఓలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ తయారీ, ఏరోస్పేస్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనూ ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
సాయంత్రం సదస్సు ముగింపు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
సాయంత్రం 4 గంటలకు జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రెండో రోజు జరిగే వరుస సమావేశాలు, పెట్టుబడుల చర్చలతో విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగియనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
-
Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!