chiranjeevi: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు అంశంపై చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్ననాటి నుంచి తెలుసన్నారు. భవిష్యత్‌లో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలియదన్నారు. తాము చెరోవైపు ఉండడం కంటే తాను తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పవన్ కు నాయకత్వ పఠిమ ఉందని భవిష్యత్ లో తప్పకుండా మంచి నాయకుడు అవుతాడడని జోస్యం చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రాన్ని ఏలే సామర్థ్యం పవన్ కు ఉందంటూ చెప్పుకొచ్చారు. బుధవారం గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో చిత్ర బృందం ప్రెస్ మీట్ ఏర్పాట్ చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.
Read Also: Mahesh Babu: హరిద్వార్లో మహేశ్ బాబు.. గంగలో తల్లి అస్థికలు నిమజ్జనం
గాడ్ ఫాదర్ సినిమాకు మాతృక అయిన లూసిఫర్ కథ ఆధారంగానే డైలాగులు ఉన్నట్లు చిరంజీవి చెప్పారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. నా నుంచి రాజకీయాలు దూరంగా కాలేదు అంటూ డైలాగ్ ను చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డైలాగులనే మీడియా ప్రతినిదులు ప్రస్తావించారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేం చేయలేనని చిరంజీవి అన్నారు. రాజకీయాల నుంచి దూరమై ప్రస్తుతం సైలంటుగా ఉన్నాను. తన తమ్ముడు పవన్ కు భవిష్యత్తులో మద్దతు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకితభావం కలిగిన నాయకుడు అవసరమని ప్రజలు భావిస్తే వారే పవన్ కు అవకాశం ఇస్తారని మెగాస్టార్ చెప్పారు.