Chiranjeevi : నాకు నచ్చితేనే చేస్తాను.. నాకు నచ్చితేనే చూస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా… చిరుకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే.. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ చిత్ర వేదళం సినిమాకు రిమేక్‌గా తెరకెక్కించారు. విడుదలకు సిద్ధమవుతున్న భోళా శంకర్ సినిమా కోసం నేడు హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ ప్రేమ ఎలాగైతే బోర్ కొట్టదో అలాగే అభిమానుల ప్రేమ కూడా బోర్ కొట్టదన్నారు.
Also Read : Explosion: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. కార్మికుడు దుర్మరణం
Also Read
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినా.. కొత్తగానే ఉంటుందన్నారు. సినిమాలోనే కాకుండా.. ఏ సాంఘీక, సంక్షేమ కార్యక్రమం చేసినా నాఫ్యాన్స్ గర్వపడేలా ఉండాలనే.. ఎన్నో విషయాలను నాలో మార్చుకున్నానని చిరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. ఖైదీ నెంబర్ 150 సినిమాలో చెప్పిన డైలాగ్‌లా ‘నాకు నచ్చితేనే చేస్తాను.. నాకు నచ్చితేనే చూస్తాను..’ అనే విధంగా.. ఈ సినిమా నచ్చే చేశానని, ఈ సినిమా మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చుతుందని, మీ నుంచి మంచి మార్కులు ఈ సినిమా సంపాదించుకుంటుందని భావిస్తున్నానన్నారు చిరు. కొన్ని సినిమాల్లో నటిస్తుంటే.. ఈ సినిమా ఎలాగొస్తుందో.. అని షూటింగ్ టైం టెన్షన్ పడుతుంటాం.. కానీ.. భోళా శంకర్ సినిమాకు అలాంటి ఏ టెన్షన్ మాకు రాలేదు. ఎందుకంటే.. ఈ సినిమా మా దృష్టి సూపర్ హిట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది.’ అని చెప్పుకొచ్చారు చిరు.
Also Read : Manipur: మణిపూర్ సర్కారుకు ఝలక్.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షం!
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!