మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. ఆ మాస్కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) నిరూపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. చిరంజీవి తన వింటేజ్ గ్రేస్‌తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, అనిల్ రావిపూడి రాసిన వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. నయనతార నటన సినిమాకు గ్లామర్‌తో పాటు హుందాతనాన్ని తీసుకొచ్చింది. సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందడం వల్లే మహిళా ప్రేక్షకులు, పిల్లలు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
Also Read :AR Rahman : రెహమాన్ వర్సెస్ ట్రోలర్స్.. మద్దతుగా నిలిచిన ప్రముఖ రచయిత వరుణ్!
ఇక తాజా సమాచారం ప్రకారం కలెక్షన్ల ప్రకారం మొదటి వారం పూర్తి చేసుకునే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్ల భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. చూడబొతే ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అందులోను ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. రాబోయే వారంలో కూడా భారీ చిత్రాలేవీ లేకపోవడంతో వసూళ్ల జోరు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
ఈ చిత్రం కేవలం కలెక్షన్లలోనే కాకుండా టికెట్ బుకింగ్స్‌లోనూ అరుదైన మైలురాయిని అందుకుంది. బుక్‌మైషో (BookMyShow) లో కేవలం 6 రోజుల్లోనే 2.8 మిలియన్ల టికెట్లు అమ్ముడై, ప్రాంతీయ చిత్రాలలో ‘ఆల్ టైమ్ ఫాస్టెస్ట్’ రికార్డును నెలకొల్పింది. ఇప్పటికి మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గకుండా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తూ హైప్ పెంచుతున్నారు. మొత్తానికి 2026 ఏడాదికి టాలీవుడ్లో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్‌తో మెగాస్టార్ బోణి కొట్టారు.