Chalapathi Rao: చలపతిరావు మరణం కలచివేసిందన్న చిరంజీవి, బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించారు. దీంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు గడవకముందే ఇండస్ట్రీ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. 1200లకు పైగా చిత్రాల్లో నటించి.. గొప్ప నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చలపతిరావు. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి, చలపతిరావు మృతి పట్ల సంతాపం తెలియ జేశారు. చిరంజీవి స్పందిస్తూ.. చలపతిరావు గారి మరణం తనను కలచివేసిందన్నారు. విలక్షణమైన నటుడిగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు చాలా మంది చలపతిరావు మరణం తీరని లోటుగా పేర్కొన్నారు.
Read Also: Chalapathi Rao: అగ్ని ప్రమాదంలో భార్యని కోల్పోయిన చలపతిరావు
Also Read
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
బాలకృష్ణ చలపతిరావు మృతిపై దిగ్భ్రాంతి చెందారు. తమ కుటుంబానికి చలపతిరావుతో మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. ‘‘చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలచి వేసింది. ఆయన తన విలక్షమైన నటనతో తెలుగు వారిని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలు తీశారు. నాన్నగారి (ఎన్టీఆర్)తో కలసి ఎన్నో సినిమాల్లో నటించారు. నా సినిమాల్లోనూ చలపతిరావు గారు నటించారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి’’అని బాలకృష్ణ పేర్కొన్నారు.
విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2022
తాజావార్తలు
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
-
Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!