China Supports India: సరిహద్దు వివాదం, గాల్వాన్ ఘటన, మొదలైన అంశాల కారణంగా భారత్ – చైనాలు ఇటీవల కాలంలో ఉప్పు.. నిప్పులా మారాయి. అలాంటిది అమెరికా అధ్యక్షుడి కారణంగా చైనా, ఇండియాకు మద్దతుగా మాట్లాడింది. అది కూడా పరోక్షంగా, ఎక్కడ భారత్ పేరును వాడకుండా తన గొంతును ట్రంప్‌కు వ్యతిరేకంగా వినిపించింది. ఇది కూడా భారత్ నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పుడు వచ్చింది.
READ MORE: Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..!
తీవ్రంగా స్పందించిన డ్రాగన్..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై అదనంగా 25% సుంకాన్ని విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన తర్వాత చైనా తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను వాణిజ్య చర్యల దుర్వినియోగంగా అభివర్ణిస్తూ అమెరికాను విమర్శించింది. గురువారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సుంకాల దుర్వినియోగాన్ని చైనా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని, దీనిపై తమ వైఖరి స్పష్టంగా, శాశ్వతంగా ఉందని అన్నారు. భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినప్పుడు ఈ ప్రకటన రావడం గమనార్హం.
మీడియాతో మాట్లాడిన ట్రంప్
వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50 శాతం సుంకాన్ని విధించామని అన్నారు. ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంలో చైనాకు దగ్గర ఉందని అన్నారు. గతంలో ఉన్న 25% సుంకం నేటి నుంచి అమల్లోకి వచ్చిందని, కొత్తగా 25% సుంకం 21 రోజుల తర్వాత అంటే ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదిరితే ఇండియాపై సుంకాన్ని తొలగించగలరా అని ఓ అంతర్జాతీయ వార్త సంస్థ అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతానికి వారు (భారతదేశం) 50% పన్ను చెల్లిస్తారని, తరువాత ఏమి జరుగుతుందో చూస్తామని ట్రంప్ బదులిచ్చారు. చైనా, టర్కీ కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండగా.. భారత్‌పై మాత్రంమే ఎందుకు ఈ ప్రతికార సుంకాలని అడిగినప్పుడు, భారతదేశంపై సుంకం విధించి 8 గంటలు మాత్రమే అయ్యిందని, భవిష్యత్తులో చాలా చూస్తారు, ద్వితీయ ఆంక్షల వరదలు వస్తాయని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న చైనాపై 30% సుంకం, టర్కీపై 15% సుంకం మాత్రమే ఉంది. ఈ వివక్షతపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ట్రంప్ నిర్ణయాన్ని చాలా దురదృష్టకరమని, అమెరికా అలాంటి చర్య తీసుకోవడం విచారకరమని పేర్కొంది. భారతదేశం జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది వెల్లడించారు. ఇండియా చమురు కొనుగోళ్లు మార్కెట్ పరిస్థితులు, 1.4 బిలియన్ ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని జరుగుతాయని స్పష్టం చేసింది.
READ MORE: Rashmika : ఎవరినీ తొక్కాలని చూడొద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్