Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మైసా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ ఎన్నడూ నా ధైర్యాన్ని కోల్పోలేదు. నాకు దయాగుణం ఎక్కువే. దాని వల్ల నాకు ఉపయోగం లేదని తెలుసు. కానీ నా చుట్టూ ఉండే వారిపై నేను దాన్ని ఎప్పటికీ చూపిస్తుంటాను. ఎవరికీ అన్యాయం చేయొద్దని మనసులో ఎప్పుడూ కోరుకుంటాను అంటూ తెలిపింది.
Read Also : Radhika Apte : ప్రెగ్నెంట్ టైమ్ లో ఆ నిర్మాత ఇబ్బంది పెట్టాడు.. హీరోయిన్ ఎమోషనల్
ఎదుటి వారి పట్ల ప్రేమతో ఉండాలనేది నా మెయిన్ పాయింట్. మనం ఎదగడం కోసం ఎవరినీ తొక్కాలని చూడొద్దు. అందరినీ ఎదగనీయాలి. నా చుట్టూ నెగెటివిటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని దాటుకుని నేను ముందుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ వస్తుంటాయి. వాటిని నేను పట్టించుకోను. మనం కరెక్ట్ గా ఉంటే అదే మనల్ని ముందుకు నడిపిస్తుందనేది నా నమ్మకం. ఎప్పుడూ ఒకే దారిలో పయనించకుండా డిఫరెంట్ గా ప్రయత్నించాలి అనే కాన్సెప్టుతోనే నేను ముందుకు వెళ్తున్నాను. అందుకే ఈ స్థాయిలో ఉన్నానేమో అనిపిస్తూ ఉంటుంది అని తెలిపింది రష్మిక. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.
Read Also : HHVM : హిందు వర్సెస్ ముస్లిం కాదు.. వీరమల్లుపై పవన్ క్లారిటీ..