China Spy Ship : స్వదేశానికి చేరుకున్న శాటిలైట్ షిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Spy Ship : చైనా అంతరిక్ష ట్రాకింగ్ షిప్ యువాన్ వాంగ్-5 తన సుదీర్ఘ మిషన్‌ను పూర్తి చేసి స్వదేశానికి చేరుకుంది. ఈ నౌక యాంగ్స్ ప్రావిన్స్ నుంచి తన సొంతగూటికి తిరిగి వచ్చింది. చైనాకు చెందిన జాంగ్సింగ్ 1ఈ శాటిలైట్‌ను హైనాన్ ద్వీపం నుంచి లాంగ్‌మార్చ్-7 శాటిలైట్ ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఈ షిప్ సహాయం తీసుకున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా హై-స్పీడ్ డేటా, టెలివిజన్, టీవీ ప్రసారాలు అందించబడతాయి.
Read Also: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్ట్.. కదులుతున్న డొంక
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
యువాన్వాంగ్-5 నౌక దక్షిణ చైనా, హిందూ మహాసముద్రాల్లో 120 రోజుల పాటు 15 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించిందని చైనా అధికారులు తెలిపారు. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఈ ఏడాది చివర్లో మళ్లీ సముద్రంలోకి పంపిస్తామన్నారు. యువాన్వాంగ్-5 నౌక ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయానికి చేరుకుంది. ఓడ ఐదు రోజులు అక్కడే ఉంది. యువాన్వాంగ్-5లో అత్యంత అధునాతన రాడార్లను అమర్చారు. గతంలో ఈ నౌక ద్వారా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించారు.
Read Also:National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం
గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ నిఘా నౌక క్షిపణులు, అంతరిక్షం, ఉపగ్రహాలను గుర్తించడమే కాకుండా 750 కి.మీ.ల దూరంలో ఉన్న గగనతలాన్ని కూడా పర్యవేక్షించగలదు. ఈ నౌక భారతదేశ తీరం దగ్గర నుండి బయలుదేరింది. మన తీర ప్రాంతంలోని కీలక స్థావరాలపై నిఘా పెట్టే అవకాశం ఉన్నందున భారత్ చైనాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే యువాన్వాంగ్-5 నౌక రాకపోకలకు శ్రీలంక అనుమతించింది. హిందూ మహాసముద్రంపై పట్టు పెంచుకునేందుకు శ్రీలంకను డ్రాగన్ దేశం పావుగా వాడుకుంటున్నది. ఈ నౌకపై భారత్, అమెరికా తదితర దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!