China Economy: చైనా ఆర్థిక మాంద్యం?.. అసలు విషయం చెప్పిన జిన్‌పింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా డ్రాగన్ కంట్రీ చైనా పేరుగాంచింది. అయితే, గత కొంతకాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. కరోనా అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకత్వం వెల్లడించారు. కానీ, చైనా అధినేత షీ జిన్ పింగ్ మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ఈ అంశంపై జిన్ పింగ్ రియాక్ట్ అయ్యారు. ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నట్ల మాట నిజమేనన్నారు.
Read Also: Municipal Staff Strike: మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలు సఫలం అయ్యేనా..?
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావించారు.. దేశంలోని వాణిజ్య, వ్యాపారాలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి.. నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన చెప్పారు. అయితే, 2013 నుంచి ప్రతి ఏటా జిన్‌పింగ్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రసంగం చేస్తున్నారు. ఆ స్పీచ్ లో ఆర్థిక సవాళ్ల గురించి ప్రస్తావించడం ఇదే ఫస్ట్ టైమ్.
Read Also: Delhi : రికార్డు.. న్యూ ఇయర్ సందర్భంగా 24లక్షల సీసాలు పీల్చేశారు
కొన్ని సంస్థలు గడ్డు పరిస్థితులను చవిచూస్తున్నాయని జిన్ పింగ్ అన్నారు. ఉద్యోగాలు లేక, కనీస అవసరాలు తీరక కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్యలపై నేను కూడా ఆలోచిస్తున్నా.. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తెచ్చేలా వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిన్ పింగ్ ప్రసంగం ముగిసిన తర్వాత.. చైనా జాతీయ గణాంకాల సంస్థ.. నెలవారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) నివేదికను రిలీజ్ చేసింది. డిసెంబర్ లో ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయినట్లు అందులో వెల్లడించింది. పీఎంఐ సూచీ తగ్గడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!