beer Sales: మండుతోన్న ఎండలు.. కూల్‌గా బీర్లు లాగిస్తున్నారుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
beer Sales: సినిమాల్లో బీర్ల గురించి చాలా సన్నివేశాలు వచ్చాయి.. ఈ టైంలో చల్లటి బీరు లాగిస్తే ఎలా ఉంటుంది..? అని తమకు తామే అనుకుని.. కూల్ బీర్లను సమ్మగా లాగిస్తుంటారు స్నేహితులు.. అయితే, ఇప్పుడు బయటక కూడా ఇలాంటి పరిస్థితి ఉంది.. క్రమంగా మద్యం ప్రియులు బీర్లు కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారట.. దీనికి ప్రధాన కారణం మాత్రం ఎండలు మండిపోవడం.. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేయడమే నట.. ఉష్ణోగ్రతలు పెరగిపోవడం.. బీర్లకు భారీగా డిమాండ్ పెరిగిందని వైన్స్, బార్ల నిర్వహకులు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్లకు డిమాండ్ ఉంటుంది.. లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మొగ్గు చూపుతుంటారు మద్యం ప్రియులు.. ఈ సారి కూడా అదే పరిస్థితి.. కాకపోతే.. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేక ఇబ్బందులు తప్పడంలేదట.
Read Also: Somvati Amavasya: నేడు సోమవతి అమావాస్య.. గంగా నదిలో భక్తుల పవిత్ర స్నానాలు
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ 60 వేల నుంచి 80 వేల కేస్లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు ఓ అంచనా.. ఇక, వేసవి వచ్చిందంటే ఇది మరింత పెరిగిపోతోంది.. వేసవిలో అదనంగా మరో 20 వేల కేస్లకు డిమాండ్ ఉందట.. కానీ, అది కొరతగానే ఉందని చెబుతున్నారు.. ప్రతీ రోజూ వైన్ షాపుల నుంచి వంద కేస్ల కోసం ఆర్డర్లు వస్తుంటే.. 60 వేల నుంచి 80 వేల వరకు మాత్రమే వైన్ షాపులకు బీర్లు చేరుతున్నాయి.. ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. క్రమంగా బీర్ల సేల్స్ పెరుగుతున్నాయి.. వైన్ షాపులకు, బార్లకు వెళ్తున్న మద్యం ప్రియులు.. కూల్‌గా బీర్లు ఆర్డర్ చేస్తున్నారట.. అయితే, సాయంత్రం, రాత్రి సమయం వచ్చేసరికి బీర్లు స్టాక్ లేకుండా అయిపోతుందని చెబుతున్నారు. గ్రేటర్‌లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బీర్లకు డిమాండ్ పెరుగుతోంది.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్ల వరకు అందుతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.. అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్లు బీర్లు లాంగిచేస్తున్నారు.. దీనిలో మెజార్టీ వాటా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలదేనని గణాంకాలు చెబుతున్నాయి.. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగింది.. ఏప్రిల్ 2023లో గ్రేటర్లో దాదాపు 12 లక్షల కేస్‌లకుపైగా బీర్ల అమ్మకాలు జరిగితే.. ఇప్పుడు 15 లక్షల కేస్లకు పైగా డిమాండ్ ఉంటుందట.. కాగా, బీర్ కేసుల విషయానికొస్తే, మే 2023లో 64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.. తెలంగాణలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు సాగించారు.. ఈ ఏడాది వీటి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!