Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్‌గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో మోసం చేసి వారి దగ్గరి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. చాలా కేసుల్లో సరోగసీ చేయకుండా.. ఆదివాసీ తల్లిదండ్రుల నుంచి పిల్లలను తక్కువ డబ్బుకు కొనుగోలు చేసి… అమ్మ పిలుపు కోసం ఎదురు చూస్తున్న తల్లులకు ఎక్కువ డబ్బులకు అమ్మేశారు. సింపుల్ గా చెప్పాలంటే చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు..
Read Also : Khazana Jewellery : ఉదయం పూట స్కెచ్.. ఖజానా జ్యువెల్లరీపై దొంగల ప్లాన్
ఒక్కొక్క దంపతుల నుంచి 50 లక్షల వరకు కొట్టేసింది డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్. మగపిల్లాడు అయితే ఏకంగా లక్ష రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు. దీనికి తోడు గర్భం దాల్చిన మహిళలకు డబ్బులు ఆశ చూపెట్టి ఫ్రీ డెలివరీ అంటూ తీసుకువెళ్లి డబ్బు ఆశ చూపించి వారికి పుట్టిన పిల్లల్ని సైతం కొనేశారు. మరోవైపు క్రినికల్ ట్రయల్స్ కోసం వస్తున్న మగ వాళ్లకు పిల్లలు కంటే డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే ఇదంతా ఓ NGO ముసుగులో చేశారు.
మరోవైపు గిరిజన ప్రాంతాల్లో సైతం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అక్కడ గర్భవతులు ఆయన మహిళలను గుర్తించి వారికి ఫ్రీ డెలివరీతో పాటు డబ్బులు ఇస్తామని చెప్పి ట్రాప్ చేశారు. అయితే ఇదంతా వైజాగ్ కేంద్రంగా వ్యవహారం నడిచిందంటున్నారు పోలీసులు. ఇప్పటివరకు 86 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసిన సృష్టి కేసులో కొత్త కొత్త విషయాలు పోలీసులు విచారణలో బయటపడింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసును సిట్‌కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జులైలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కేసులో మొదట 8 మందిని.. తర్వాత 16 మందిని అరెస్టు చేసినట్ల ఆమె వివరించారు. అరెస్టయిన వారిలో వైద్యులు, ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాను నిలిపివేశామని చెప్పారు. గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్ నంబర్, లెటర్ హెడ్స్‌తో అక్రమాలు చేసినట్లు పోలీసులు తెలిపారు…
సికింద్రాబాద్‌లో సృష్టి సెంటర్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్ కాగా.. మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకొని నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు గుర్తించారు. విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యుల్లత, వైద్యులు రవి, ఉష ఈ పనిచేశారు. ఈ కేసులో సరోగేట్‌గా, అండదానం ఇచ్చే వారిగా కొందరు మహిళ ఏజెంట్లు పని చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్స్ కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారు. 9 నెలల పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసీ కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు. మగ బిడ్డకు రూ.4.5 లక్షలు, ఆడబిడ్డకు రూ. 3 లక్షల ధర నిర్ణయించారు…
డాక్టర్ నమ్రత అక్రమార్జనను ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారనే విషయాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నామని డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. కేసులో ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు చెప్పారు.
