Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్‌గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Baby Sale : నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా పుట్టిన పసికందును అమ్మేందుకు ఓ తల్లి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. డబ్బుల విషయంలో చోటుచేసుకున్న గొడవతో ఈ అంశం బయటపడటంతో పోలీసులు విచారణ ప్రారంభించి కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన appena పుట్టిన శిశువును పులాంగ్‌కు చెందిన ఓ దంపతులకు విక్రయించింది. ఈ…
CP Sudheer Babu : రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు…
"పిల్లల్ని నేను కిడ్నాప్ చేయలేదు.. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం.. లక్ష రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాం.. ఆ తర్వాత పిల్లలు లేని వాళ్లకు వారిని అమ్మి సొమ్ము చేసుకున్నాం. ఒక్కొక్క పిల్లాడికి ఐదు నుంచి పది లక్షల రూపాయలుకు అమ్మివేశాం.. మేము కిడ్నాపర్లం కాదు. కేవలం పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ మాత్రమే అమ్మినం.." ఇది పసి పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న నిందితుల వాదన.