Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్‌గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Srushti IVF: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సృష్టి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మహిళలే కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం, అరెస్టయిన ఈ ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువుల క్రయ విక్రయాలలో వీరు నమ్రతకు నేరుగా సహకరించారు. ఈ సేవలకు…