ఓ వ్యక్తి మృతి కేసులో కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి మరి. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్‌కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సత్తయ్య మృతికి కోడే కారణమని A1 ముద్దాయిగా చేర్చి, పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే.. తన కూతలతో స్టేషన్‌ను హోరెత్తిస్తోంది ఆ కోడి.
Also Read : AP Cabinet: ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ.. అందుకేనా?
ఇదిలా ఉంటే.. గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఘటనే అదే ఊరిలో చోటు చేసుకుంది.. జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. దీంతో బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు.
Also Read : Green India Challenge:’ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పోస్టర్ విడుదల