టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న నయావాల్ పుజారా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఏడు బంతుల వ్యవధిలోనే పుజారా రెండు సార్లు డకౌటవ్వడం విశేషం. అయితే అంపైర్, ఆస్ట్రేలియా తప్పిదంతో గట్టెక్కిన పుజారా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే లియోన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో పాటు ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోకపోవడం పుజారాకు కలిసొచ్చింది.
Also Read: Ben Stokes: బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు.. ఆ లిస్టులో నెంబర్‌వన్‌గా!
అప్పటికే రెండు రివ్యూలను వృథా చేసుకున్న ఆసీస్.. మరో సమీక్ష తీసుకోవడానికి దైర్యం చేయలేకపోయింది. దాంతో ఊపిరి తీసుకున్న పుజారా.. లియోన్ వేసిన మరుసటి ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. మరోసారి అంపైర్ ఔటివ్వకపోగా.. ఈ సారి ఆసీస్ ఎలాంటి తప్పు చేయలేదు. ధైర్యంగా రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. రిప్లేలో బంతి ముందుగా ప్యాడ్‌ను తాకిన తర్వాత బ్యాట్ తాకినట్లు తేలడంతో పుజారా వెనుదిరగక తప్పలేదు. దాంతో 100వ టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగిన 8వ బ్యాటర్‌గా పుజారా చెత్త రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెట్ దిలీప్ వెంగ్‌సర్కార్ అగ్రస్థానంలో ఉండగా.. అలెన్ బోర్డర్, వాల్ష్, టేలర్, ఫ్లెమింగ్, అలిస్టర్ కుక్, బ్రెండన్ మెక్‌కలమ్.. పుజారా కన్నా ముందున్నారు.
Also Read: Hema Malini-Dharmendra: హేమమాలిని- ధర్మేంద్రకు తెలిసిన కిటుకు ఏమిటి?