Chess Dance: ఇప్పుడు ఎక్కడ చూసినా చెస్ యువరాజు గుకేశ్ పేరు వినిపిస్తోంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే అనుభవజ్ఞుడైన డింగ్ లిరెన్‌ను ఓడించి చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత విజయానికి సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇకపోతే తాజాగా, ఇద్దరు కళాకారిణులు తమ సృజనాత్మక నృత్యంతో గుకేశ్ విజయానికి వినూత్న శైలిలో అభినందనలు తెలిపారు. కథక్ నృత్యకారిణులు అనుష్క చందక్, మైత్రేయి నిర్గుణ్ గుకేశ్ చాంపియన్‌షిప్ గేమ్‌ను ప్రతిబింబించేలా ప్రత్యేక నాట్యాన్ని ప్రదర్శించారు. ఆఖరి గేమ్‌లో గుకేశ్ నల్లపావులతో, లిరెన్ తెల్లపావులతో ఆడినట్లు డ్యాన్సర్లు నలుపు, తెలుపు దుస్తుల్లో నృత్యం చేశారు. గేమ్‌లో గుకేశ్ ఎత్తులు, లిరెన్ వ్యూహాలు ఆఖరికి విజయం ఎలా సాకారం అయ్యిందో నాట్య రూపంలో చూపించారు. ఈ వినూత్న ‘చెస్ నాట్యం’ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ కళాకారుల సృజనాత్మకతను అభినందిస్తూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Encounter In Jammu: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
కథక్ నృత్యకారిణులు అనుష్క చందక్, మైత్రేయి నిర్గుణ్ చేసిన ప్రత్యేక నృత్య ప్రదర్శన ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరులో గుకేశ్ నల్లపావులతో, ప్రత్యర్థి లిరెన్ తెల్లపావులతో ఆడిన గేమ్‌ను ఆధారంగా చేసుకుని, ఈ డ్యాన్సర్లు నలుపు, తెలుపు దుస్తుల్లో నాట్యం చేశారు. ఆఖరి గేమ్‌లో ప్రత్యర్థి లిరెన్ చేసిన ఎత్తులు, వాటికి గుకేశ్ వేసిన పైఎత్తులను ప్రతిబింబించేలా తమ నృత్యంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ వినూత్న ‘చెస్ నాట్యం’ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు గంటలకు పైగా సాగిన ఆఖరి గేమ్ 58 ఎత్తుల్లో ముగిసింది. గేమ్ ఆరంభంలో డ్రా దిశగానే సాగింది. ఎందుకంటే ఇద్దరి దగ్గర ఒక్కో ఏనుగు, ఒంటె మాత్రమే ఉండగా, గుకేశ్ కాస్త ప్రయోజనంగా సైనికుడితో ముందంజలో ఉన్నాడు. అయితే, గేమ్ డ్రా అయ్యే అవకాశమేనని, విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అవసరం అవుతుందని అందరూ భావించారు.
అయితే, 55వ ఎత్తులో లిరెన్ చేసిన తప్పిదం గేమ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. లిరెన్ తన ఏనుగును త్యాగం చేయడానికి ఎఫ్4 నుంచి ఎఫ్2కు కదిపాడు. ఆ వెంటనే గుకేశ్ తన ఏనుగుతో దాన్ని చంపేశాడు. తరువాత, గుకేశ్ తన ఏనుగును లిరెన్ రాజుతో బయటకు తొలిగించనప్పటికీ, రెండు ఒంటెలను ఇద్దరూ ఆటగాళ్లు త్యాగం చేశారు. చివరికి లిరెన్ దగ్గర ఒక రాజు, ఒక సైనికుడు మాత్రమే మిగిలి ఉండడంతో విజయం సాధించడం అసాధ్యమని గ్రహించి లిరెన్ గేమ్ నుంచి నిష్క్రమించాడు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.