తాజాగా ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బును మింగేశాడు. దాంతో అది కాస్త అతని ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఎల్ఈడి బల్బును బయటకు తీసేందుకు బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్ల ప్రయత్నించిన విఫలమయ్యారు. దాంతో వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడు తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. కాకపోతే ఐదేళ్ల పిల్లాడికి ఓపెన్ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నదంటూ డాక్టర్లు తెలిపారు. ఒకవేళ ఆపరేషన్ చేసిన కానీ ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగింది. ఐదేళ్లు ఉన్న పిల్లాడు ప్రమాదవశాత్తు ఎల్ఈడి బల్బును మింగడం వల్ల తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో అనేది ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
Also Read: T20 World Cup 2024: హార్దిక్ పాండ్యా బదులుగా.. అతడిని తీసుకుంటే బాగుండేది!
బాలుడిని చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రికి తరలించారు తల్లితండ్రులు. ఇక మరోవైపు గత శుక్రవారం బాలుడిని పరీక్షించిన చిన్నారుల వైద్యులు సీటీ స్కాన్ చేశారు. బాలుడి ఊపిరితిత్తుల శ్వాసనాళంలో ఎల్‌ఈడీ లైట్ కనిపించింది. బ్రాంకోస్కోపీ ద్వారా దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తామని వైద్యులు బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. అయినప్పటికీ, ఇది విజయం కాకపోతే, వారు ఓపెన్ సర్జరీ చేయించుకోవలసి ఉంటుంది.
Also Read: Job Seeker: ఉద్యోగం కోసం కంపెనీ యాజమాన్యానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి.. పోస్ట్ వైరల్..
అయితే అదృష్టం కొద్దీ బ్రోంకోస్కోపీ ద్వారానే ఆ మింగిన ఎల్ఈడీ బల్బును విజయవంతంగా తొలగించారు వైద్యులు. దీంతో ఓపెన్ సర్జరీ అవసరం పడలేదు. అంతేకాకుండా, బాలుడు ఆరోగ్యంగా ఉన్నందున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.