Leopard at Mahanandi Temple: నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మహానంది క్షేత్రానికి 6 కిమీల సమీపంలోని క్రిష్ణనంది క్షేత్రం వద్ద చిరుత సంచరిస్తోంది. చిరుతను చూసి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఓ గంట తర్వాత మహానంది క్షేత్రంలోని పెద్ద నంది వద్ద చిరుత కనిపించింది. రెండు ఒకటేనా లేదా వేరువేరా అని స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయ్యాయి. Also…