యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో గ్లోబల్ వైడ్ గా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మరియు కల్కీ 2898AD చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన ప్రభాస్ వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమాతో ప్రభాస్ కు ఫాలోయింగ్ పెరిగింది.. ఆ సినిమా తరువాత ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసిన స్టార్ స్టేటస్ అందుకోలేదు.ఆ టైంలో ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకేక్కిన ఛత్రపతి మూవీ అల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది..
ఈ సినిమాలో ప్రభాస్, శ్రియా జంటగా నటించారు.2005లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ ఏకంగా రూ.30 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పూర్తిగా మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా లో భానుప్రియ కీలకపాత్ర పోషించారు.ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోగా మారారు.. ఇదిలా వుంటే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు ఛత్రపతి మేకర్స్.ఛత్రపతి మరోసారి థియేటర్లలోకి రాబోతుంది.దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఈ ను మరోసారి రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిని 4కే వెర్షన్ లో అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు కు సంబంధించిన బుకింగ్స్ అన్నింటిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ లో కోట శ్రీనివాస్ రావు, ప్రదీప్ రావత్ మరియు జై ప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు..