Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Change In Vehicle Registration From Ts To Tg

Vehicle Registration: ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ నుంచి టీజీకి మార్పు…!

Published Date :March 13, 2024 , 7:28 am
By Chandra Shekhar Pamena
Vehicle Registration: ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ నుంచి టీజీకి మార్పు…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana: మంగళవారం నాడు తెలంగాణ రాష్టంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలోని భాగంగా మార్క్‌ ను టీఎస్‌ నుంచి టీజీ కి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. ఇందుకుగాను 1988లోని సెక్షన్‌ 41(6) మోటారు వాహనాల చట్టం కింద ఉన్న అధికారాలను వాడుకొని 1989 జూన్‌ 12 నాటికి అప్పటి రవాణా శాఖ జారీ చేయబడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అందులోని నోటిఫికేషన్‌ లో టేబుల్‌ సీరియల్‌ నంబర్‌ 29A కింద.., తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న టీఎస్‌ స్థానంలో అదికాస్తా తాజాగా టీజీ మార్క్‌ కేటాయించినట్లు తెలిపింది.

Read Also: Nagpur Bus Driver: చేతికి బుల్లెట్‌ గాయం.. 30 కిమీ బస్సు నడిపిన డ్రైవరు! 35 మంది సేఫ్

ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌ లో మార్పు చేయాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రివర్గంలో ఈ విషయం ఫై తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞ్యప్తి పంపారు. దీన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక ఫై రాష్ట్రంలో రిజిస్టర్‌ అయ్యే వాహనాల మార్క్‌ టీఎస్‌ నుంచి టీజీకి మారనుంది. దింతో ఇక ఫై వాహనాల నెంబర్ ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీ గా మారనుంది. ఈమేరకు వాహనదారులు వారి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ ను ఇప్పుడు మల్లి మార్చుకోవాలా..? అని సందేహం ప్రతి ఒక్క వాహనదారుడికి వస్తోంది. ఈ సందర్బంగా రవాణా శాఖకు చెందిన అధికారులు నంబర్ మార్పుపై స్పష్టమైన సమాచారం ఇచ్చారు.

Read Also: Election Commission : ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం.. మార్చి 14న సెలక్షన్ కమిటీ సమావేశం

ఇందుకు గాను ప్రస్తుతం ఉన్న నంబర్ ప్లేట్లను ఎలాంటి మార్పులు చేసి మార్చుకోవాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జీవో వచ్చిన తర్వాత ఎవరైతే కొత్తగా కొన్న వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని వారు తెలిపారు. ఇదివరకు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి టీఎస్‌ గా మార్చుకోవాల్సిన అవసరం రాలేదని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రం ఎప్పటిలాగానే యధావిధిగా కొనసాగాయని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించవచ్చని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gazette notification
  • Telangana vehicles
  • TG
  • ts
  • Vehicle Registration

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions