Chandrayaan-3: జాబిల్లిపై 8 మీటర్లు ప్రయాణించిన రోవర్.. ఇస్రో కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. అన్ని ప్రణాళికాబద్ధమైన రోవర్ కదలికలు ధృవీకరించబడ్డాయని, రోవర్ దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా అధిగమించిందని, రోవర్ పేలోడ్లు LIBS, APXSలు ఆన్ చేయబడ్డాయని ఇస్రో ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్లు పని చేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది.
Read Also: ISRO Scientists: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న ప్రధాని
Also Read
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) చంద్రుని ఉపరితలం రసాయన కూర్పు, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించడం లక్ష్యంగా పెట్టుకుంది. లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్రుని నేల, రాళ్ల మూలక కూర్పు (Mg, Al, Si, K, Ca, Ti, Fe)ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ల్యాండర్ పేలోడ్లు ILSA, RAMBHA, ChaSTEలను ఆన్ చేసినట్లు ఇస్రో గురువారం తెలిపింది. ILSA పేలోడ్ ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంప కార్యకలాపాలను కొలుస్తుంది. RAMBHA చంద్రుని చుట్టూ ఉన్న ప్లాస్మా వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ChaSTE పేలోడ్ చంద్రుని ఉపరితల ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది.
Chandrayaan-3 Mission:
All planned Rover movements have been verified. The Rover has successfully traversed a distance of about 8 meters.
Rover payloads LIBS and APXS are turned ON.
All payloads on the propulsion module, lander module, and rover are performing nominally.…
— ISRO (@isro) August 25, 2023
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?