Site icon NTV Telugu

Botsa Satyanarayana: చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది

Bosta

Bosta

చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు. అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని.. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాత మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: Sreenu Vaitla: శ్రీను వైట్ల అజ్ఞాత వాసానికి తెర.. సినిమా మొదలెట్టేశాడు!

మరోవైపు మంత్రి విడుదల రజని మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామమన్నారు. చంద్రబాబు లా పరిధి దాటి ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారని.. ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇది తొలి అరెస్ట్ కాదని.., ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారని మంత్రి తెలిపారు. ఈ స్కాంలో అనేక మంది పాత్ర ఉందన్నారు. క్యాబినెట్ నిర్ణయానికి, అగ్రిమెంట్ కి, చెల్లింపులుకి పొంతన లేవని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము దారుణంగా దోచుకున్నారని మంత్రి విడుదల రజని విమర్శించారు.

Read Also: Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలి

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో బాబు భారీ స్కాం చేశారని ఆరోపించారు. సీమెన్స్ తో రూ. 3356 కోట్లతో అప్పట్లో ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సిమెన్స్ 90% ప్రభుత్వం 10% పెట్టుబడి పెట్టాలని ఒప్పందం ఉందని.. కానీ ఆ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం రూ. 371 కోట్ల నిధులు విడుదల చేసిందని.. ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్లాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.

Exit mobile version