కేంద్రం సుముఖంగా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి కులగనన జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ నెల 19న ప్రారంభమైన కుల గణన కార్యక్రమాన్ని విజయవంతంగా…
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు.
పండుగల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓనమ్ పండుగ తర్వాతే కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభించాయని గుర్తుచేశారు… కరోనా నిబంధనలు పాటించాలని అలాంటి పరిస్థితి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పలుచోట్ల కోవిడ్ పాజిటివిటీ రేటు 13శాతం ఉందని గుర్తుచేసిన మంత్రి.. వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనేది…