Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల ఏపీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో తనపై సీఐడీ కేసు నమోదు చేసిందని చంద్రబాబు అన్నారు.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
అయితే, తననను పొలిటికల్ గా దెబ్బ తీసేందుకు వరుస కేసులు పెడుతున్నారని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదులో చోటు చేసుకున్న ఆలస్యానికి తప్పుడు కారణాలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ఏ ప్రైవేటు సంస్థ లబ్ధి పొందిందో ఎఫ్ఐఆర్లో వెల్లడించలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ ను పరిశీలిస్తే తెలుస్తుంది.. ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ఉందని తెలిపారు.
Read Also: Karnataka: డబ్బాలో డబ్బు.. తీసి చూస్తే ఉప్పు.. ఏం ఐడియా సర్ జీ
వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై గళమెత్తుతున్నామని తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ తనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. అధికార పార్టీ చెప్పినట్లే ఏపీ సీఐడీ అధికారులు నడుస్తున్నారని ఆయన అన్నారు. ఇక, ఇసుక కేసులోనూ అక్టోబరు 3న ప్రాథమిక విచారణ ప్రారంభించినా.. వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయలేదు అని చంద్రబాబు అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?