రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది.. ఏపీలో సంచలనంగా మారిన మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, మిథున్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది..
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు రానుంది.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవీ..
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోహషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొనింది. సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకు షరతు విధించింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు.
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.