హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు.. ప్రతి గల్లికి హనుమాన్ టెంపుల్ ఉంటుంది.. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కాగా ఆ సంగతి పక్కన పెడితే మీరు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ఒక్కసారి చేస్తే చాలు అవన్నీ దూరం అవ్వడం మాత్రమే కాదు సంతోషాలు వెల్లువిరుస్తాయి..
ఆంజనేయ స్వామిని భక్తితో కొలిస్తే ఎలాంటి భాధలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.. ఆలయంలో ఉన్న రావి చెట్టుకు 11 సార్లు నిదానంగా నెమ్మదిగా తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. స్త్రీలకు మధ్యలో విరామం వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి తిరిగి ప్రారంభించిన 41 రోజులు పూర్తి చేయాలి.. ఇలా చెయ్యడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు..
ఇక ముందుగా స్వామికి దీపాన్ని వెలిగించాలి.. రావి ఆకుపై పిండితో తయారు చేసిన దీపానికి పువ్వులు పసుపు కుంకుమతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి. పిండితో చేసిన ప్రమిదలో కొంచం బెల్లం వేసి దానిపై వత్తి వేసి నునే పోసి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.. ఇంట్లో గొడవలు జరుగుతుంటే, తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని యథాశక్తి శ్రీరామ నామ జపం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ పూజ చేస్తున్నన్ని రోజులు తల్లిదండ్రులకు అలాగే గోమాత ప్రదక్షిణ చేయడం తప్పనిసరి. మూగ జీవాలకు, పేదలకు మీకు తోచిన సాయాన్ని చెయ్యడం వల్ల మనశాంతి కలుగుతుంది..