Site icon NTV Telugu

CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు

Tdp

Tdp

ఒంగోలులో టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Also Read:TG: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జీర్ణించుకోలేకపోతున్నాను.. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది.. హత్య పైన నిన్నటి నుంచి అన్ని విధాల అన్వేషిస్తున్నాం.. 12 టీములతో దర్యాప్తు చేస్తున్నాం.. కరుడు కట్టిన నేరస్తులతో హత్య చేయించారు.. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని పిస్తుంది.. వీరయ్య చౌదరి మంచి నాయకుడు, సమర్థమైన వ్యక్తి.

Also Read:GHMC : ప్రశాంతంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

యువగళం సమయంలో 100 రోజులు నారా లోకేష్ తో తిరిగారు.. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో రైతులకు అండగా నిలబడ్డాడు.. ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజక వర్గాల్లో వీరయ్య చౌదరి పని చేశారు.. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగడం జీర్ణించుకోలేకపోతున్నా.. సీసీటీవీ కెమెరాల నుంచి క్లూస్ కూడా తీసుకుంటున్నాం.. ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వండి.. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారు..

Also Read:GHMC : ప్రశాంతంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

నేరగాళ్లను పట్టుకుని తీరుతాం, కఠిన శిక్ష విధిస్తాం.. మా కుటుంబ సభ్యుల లాగా వీరయ్య కుటుంబాన్ని చేసుకుంటాం.. నేర రాజకీయాలు చేసేవాళ్లను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం.. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు.. హత్యలు చేయడం దుర్మార్గమైన పని.. హత్య కేసును ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదు.. రాజకీయ కోణం, వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేక పోవడం లాంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. నేరస్తులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version