ఏపీలో వెలువడుతున్న ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ జరిగింది. టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. తాజా ఫలితాలపై విశ్లేషించారు. టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సీఎం ఢిల్లీ పర్యటన పైనా ప్రస్తావన వచ్చింది. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. నేతలతో చంద్రబాబు కీలక అంశాలు ప్రస్తావించారు.
Read Also:TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులంతా కష్టపడ్డారు. ప్రజల మద్దతు మన పక్షానే అని తేలింది.ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు లొంగలేదు.ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది.ఇదే స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి.హడావుడిగా ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రాష్ట్రానికి ఏం తెచ్చారో ఈసారైనా చెబుతారా..అన్నారు చంద్రబాబు. ఇటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు చూస్తేనే ఈ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.ఈ ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు.ప్రజాగ్రహం ఉంటే మనీ పవర్, మజిల్ పవర్ వంటివి ఏం చేయలేవనేది ఈ ఎన్నికల ఫలితాలే సంకేతం.నీరో చక్రవర్తి తరహాలో జగన్ ప్రభుత్వం కూడా నాశనం కావడం ఖాయం.విశాఖ రాజధాని విషయంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
కోర్టు పరిధిలో ఉండగా విశాఖ రాజధాని గురించి మాట్లాడ్డం తప్పు.పార్లమెంటులో సవరణ జరిగితే తప్ప రాజధాని మార్పు సాధ్యం కాదు.ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో రాజధానిని కోరుకోవడం లేదు.వైసీపీని చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారు.వైసీపీ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు.వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు ఉత్తరాంధ్ర వ్యతిరేకంగా ఓటేశారన్నారు యనమల.
Read Also: IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ ఒంటరి పోరు.. ఆస్ట్రేలియాపై భారత్ గెలుపు