Chandrababu Meet Amit Shah: అమిత్‌షా-చంద్రబాబు కీలక భేటీ.. కేబినెట్ కూర్పుపై చర్చ..
- గన్నవరం చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
- స్వాగతం పలికిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి టీడీపీ అధినేతతో భేటీ అయిన అమిత్ షా
- ఏపీ కేబినెట్ కూర్పుపై చర్చ
- ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాతే గవర్నర్ కు కేబినెట్ మంత్రుల జాబితా వెళ్లే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Meet Amit Shah: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరికి ఏ పదవులు అనే దానిపై కూడా కసరత్తు చేశారు.. అయితే, దీనికి కూటమి పార్టీలోని అగ్రనేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది.. రేపు ప్రమాణస్వీకారం ఉండగా.. ఈ రోజు రాత్రికే విజయవాడ చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వారికి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు అమిత్‌షా, జేపీ నడ్డా.. టీడీపీ అధినేతతో కేబినెట్ కూర్పుపై చర్చ జరుగుతోంది..
Read Also: World Bank: భారత్ ఆర్థిక వ్యవస్థ బుల్లెట్ వేగంతో వృద్ధి చెందుతుంది.. ప్రపంచ బ్యాంకు వెల్లడి
Also Read
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
ఏపీ కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరెవర్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే అంశంపై చంద్రబాబు-అమిత్‌షా, నడ్డా మధ్య చర్చ సాగుతోంది.. ఇక, బీజేపీ విషయంలో క్లారిటీ వచ్చాకే.. మంత్రివర్గంపై చంద్రబాబు ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.. ఇవాళ అర్థరాత్రి తర్వాతే గవర్నర్‌కు మంత్రుల జాబితాను చంద్రబాబు నాయుడు పంపిస్తారని చెబుతున్నారు.. అమిత్ షాతో భేటీ తర్వాతే మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్లు చేయనున్నారట.. అయితే, ఇప్పటికే విజయవాడ, గుంటూరులో తమ ఫ్యామిలీలతో సహా దిగిపోయారు ఆశావహులు. చంద్రబాబు నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.. రేపే ప్రమాణస్వీకారం ఉండడంతో.. తగిన ఏర్పాట్లతో అధినేత ఫోన్ కోసం వేచిఉన్నారట.. మరి.. అమిత్‌షా-చంద్రబాబు భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? బీజేపీకి ఎన్ని పదవులు దక్కనున్నాయి…? ఏ శాఖలు కేటాయిస్తారు..? జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంను చేస్తున్నారా? జనసేనకు దక్కే మంత్రి పదవులు ఎన్ని..? టీడీపీలో ఏ నేతను మంత్రి పదవి వరించనుంది.. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది? అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారిపోయింది.
తాజావార్తలు
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
-
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!