CM Chandrababu: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని వెల్లడించారు.. తాజాగా ఏర్పాటు చేసి కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామాజిక పెన్షన్‌లో పూర్తి సంతృప్తి ఉందన్నారు. ఇళ్ళు లేని వారికి ఇళ్లు ఇవ్వాలి.. ప్రతి వర్గంలో ప్రజల సంతృప్తి స్థాయి ముఖ్యమన్నారు. ప్రజల సంతృప్తి ఎంత ఎక్కుఉందో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం లో రాగ ద్వేషాలు లేవు. పర్ఫార్మెన్స్ ముఖ్యమన్నారు. పాలన పై స్పష్టత ముఖ్యం.. ప్రిపరేషన్ ఉంటే మైండ్ సెట్ మార్చు కోవచ్చని చెప్పారు. ప్రజా సమస్యలపై. అన్ని లైవ్ లో ప్రజలకు తెలియాలి.. అందుకే పారదర్శకంగా ప్రజలకు లైవ్ లో అన్ని విషయాలు చెప్తున్నామన్నారు. పీపీపీ పద్దతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని పునరుద్ఘాటించారు..
READ MORE: CM Chandrababu Naidu: ఆ విషయంలో గ్రేట్! పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు..
“వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి.. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది.. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరిగాయి.. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృథా చేశారు.. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లం.. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్ గా మారింది.. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది.. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి.. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా.. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారు… అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. 13-14 శాతంతో అప్పులు తీసుకువచ్చి సమస్య సృష్టించారు.. అనాలోచిత ధోరణితో ఎస్టాబ్లిష్ మెంట్ వ్యయం భారీగా చేశారు.. ఇప్పుడు అప్పులు రీ-షెడ్యూలు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులను రీ-షెడ్యూలింగ్ చేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.