NTV Telugu Site icon

PM Modi Nomination: ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్..!

Chandrababu

Chandrababu

Loksabha elections 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో నామినేషన్ వేయబోతున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.

Read Also: Sushil modi: సుశీల్ మోడీ మృతిపై ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురి సంతాపం

అయితే, చంద్రబాబు నేటి ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమం తర్వాత ఎన్డీయే పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.. ఆ తర్వాత సాయంత్రం విజయవాడకు బయలుదేరి రానున్నారు. ఇక, వారణాసి పట్టణంలో లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న మోడీ సోమవారం ఆరు కిలో మీటర్ల మేర నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే వారణాసికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.

Read Also: AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈఓ

ఇక, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో పాటు పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్ ), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్‌), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్ గఢ్ ), ఏక్ నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హర్యానా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్‌ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర)తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Show comments