Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి.. భారీ మార్పు తప్పదా?
- ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి
- షెడ్యూల్ విడుదల వాయిదా
- ట్రోఫీ ఫార్మాట్లోభారీ మార్పు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరిగే అవకాశం ఉంది. టోర్నీ ఇంకా దాదాపు 70 రోజుల సమయమే ఉంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే డబ్బు ఖర్చు చేసిన బ్రాడ్‌కాస్టర్స్ ఆందోళన చెందుతున్నాయి. షెడ్యూల్‌ను త్వరగా విడుదల చేయాలని ఐసీసీపై ఒత్తిడి పెంచుతున్నాయి. పీసీబీ ఏ విషయం చెప్పకపోవడంతో.. ఐసీసీ సందిగ్ధంలో పడింది. అయితే షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైతే.. టోర్నీలో భారీ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మాట్లో కాకుండా.. టీ20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం ఉందట.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్‌కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బ్రాడ్‌కాస్టర్స్ సహా కొంతమంది వాటాదారులు టీ20 ఫార్మాట్‌ను ప్రతిపాదించారని సమాచారం. ‘ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి కొనసాగితే.. టోర్నీని టీ20 ఫార్మాట్‌కు మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. వన్డేలకు రానురాను ఆదరణ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌గా మార్చితే.. సులభంగా, వేగంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరి ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ఓకే చెబితే.. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్‌కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!