యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఛాంపియన్స్…