Champions Trophy 2025: హమ్మయ్య.. పాకిస్థాన్‌కు రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
- ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం
- ఫిబ్రవరి 16న లాహోర్‌లో ఆరంభోత్సవ కార్యక్రమం
- కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు మ్యాచ్‌లతో బిజీగా ఉన్న కారణంగా కెప్టెన్ల ఫొటోషూట్ నిర్వహించడం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లకు తీరిక లేని షెడ్యూల్ ఉంది. భారత్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఆడనుంది. శ్రీలంకలో పర్యటనలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీకి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ పాక్ చేరుకుంటాయి. సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశం నిర్వహించడం లేదు’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ల ఫొటోషూట్ లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనమిది టీమ్స్ తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగబోతోంది. టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్ Aలో భారత్ సహా పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ దుబాయ్ వేదికగా తలపడనుంది. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..