Chalaki Chanti : జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది హీరోలుగా కమెడీయన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చలాకీ చంటి ఒకరు. అంతకు ముందు కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడీ స్టార్ కమెడియన్. ఆ తర్వాతే జబర్దస్త్ లో అడుగు పెట్టి టీమ్ లీడర్ అయ్యారు. తనదైన శైలిలో కామెడీ పంచులతో చలాకీ చంటి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్ బాస్ షోలోనూ కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. గతంలో ఇక పలు టీవీషోలకు హోస్ట్ గానూ వ్యవహరించాడు. ఇలా వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉంటే చంటి గతేడాది తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. హార్ట్ అటాక్ తో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చలాకీ చంటి ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ స్టార్ కమెడియన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
Read Also:Rajanna Sircilla: తాగి చిల్ అవ్వాలి గానీ.. ఛాలెంజ్ చేసి ప్రాణంతో చెలగాటం అవసరమా?
చలాకీ చంటీ మాట్లాడుతూ.. ‘‘నేను హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో చేరినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సాయం లభించలేదు. కనీసం ఎవరూ పలకరించలేదు. కొంతమంది మాత్రమే ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతామని అప్పుడు నాకు అర్థమైంది. డబ్బులు లేకపోతే ఎవరూ వచ్చి సాయం చేయరు. నేనే కాదు ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే. మనం కూడా ఎవరి దగ్గర కూడా సాయం ఆశించకూడదు. స్నేహితులే అయినా డబ్బు విషయంలో హెల్ప్ చేయరు. నాకు ఈగో ఉందని, షూటింగ్ కి వస్తే కొన్ని అలుగుతానని కొంతమంది నన్ను నెగిటివ్ గా ప్రచారం చేసి, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికించారు. నాకు రావాల్సిన మంచిని ఆపేసి, నాకు రావాల్సిన ఛాన్సులు రాకుండా చేశారు. అలా చేసిన వాళ్లు సర్వ నాశనం అయిపోతారు. నేను బతికుండగానే వాళ్లు నాశనం అవ్వాలి. అది చూసే నేను చచ్చిపోవాలి.’’ అని సంచలన కామెంట్స్ చేశారు.
Read Also:MechanicRocky : ట్రైలర్ డేట్ వచ్చింది.. సినిమా రిలీజ్ డేట్ మారింది..