Rajanna Sircilla: ఒక వైపు దసరా పండుగ, మరోవైపు ఆదివారం ఇక యువతకు ఫుల్ జోష్ అనే చెప్పాలి.. ఆరోజుల్లో చుక్క, ముక్క ఉండాల్సిందే మరి. ఆ రోజుల్లో తాగి తూగాల్సిందే.. ఫుల్ ఖుష్ కావాల్సిందే. మందు తాగి ఎంజాయ్ చేయాలి కానీ.. ఛాలెంజ్ లు చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. మద్యం మత్తులో ముగ్గురు యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో హల్ చల్ చేస్తుంది.
Read also: పచ్చివి తింటే కడుపు నొప్పి.. మరి ఉడికించి తింటే..?
జరిగింది ఇదే..
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం సేవించేందుకు ప్లాన్ వేసుకున్నారు. ఊరి చివర పెద్ద చెరువు సమీపంలోని పెద్దమ్మ టెంపుల్ వద్ద మందు విందుకు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన యువకులు ఫుల్ గా మద్యం సేవించారు. మద్యం మత్తులో వారు ముగ్గురు కలిసి పెద్దమ్మ దేవాలయం నుండి పెద్ద చెరువు కట్ట వరకు ఎవరు ముందుగా ఈత కొడుతూ చేరుకుంటారో తేల్చుకుందామని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఛాలెంజ్ ప్రకారం ముగ్గురు యువకులు మద్యం మత్తులో చెరువులో దూకి కొంత ఈత కొట్టగా, ముగ్గురిలో నుండి ఇద్దరు యువకులు అలిసిపోయి తిరిగి ఒడ్డుకి చేరుకున్నారు.
Read also: Heavy Traffic: దసరా ముగించుకొని నగరానికి.. పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ..
ముగ్గురిలో ఒకరైన సుమంత్ నాయక్ అనే యువకుడు అటు గమ్యం చేరుకోలేక, ఇటు ఒడ్డుకి రాలేక చెరువులోని బండరాయిపై చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్ఐ గణేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ కుమార్ సహాయంతో చెరువులో ఉండిపోయిన సుమంత్ నాయక్ ను ట్రాక్టర్ ట్యూబ్ ద్వారా ఒడ్డుకి చేర్చి కాపాడారు. మద్యం మత్తులో ప్రాణం తీసేంత ఛాలెంజ్ లు అవసరామా? అంటూ స్థానికులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులతో ప్రాణాలతో చెలగాటమాడిన ముగ్గురు యువకులపై మండిపడ్డారు. మద్యం సేవించి ఆనందంగా గడపాలి గానీ ఛాలెంజ్ లు చేసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఏంటని ముగ్గురు యువకులపై ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటలకు దూరంగా ఉండాలని, ఇప్పటికైనా యువత మారాలని సూచించారు. అలా మద్యం తాగాలని ప్రోత్సహించడం లేదని.. దేనికైనా ఒక సమాయం సందర్భం ఉంటుందని తెలిపారు.
Different Weather: రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం.. సతమతమవుతున్న ప్రజలు..