LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు
- ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
- రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు
- రాష్ట్రాలకు 70% గ్యాస్ కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సంక్షోభం తలెత్తిండి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయండంతో సరఫరా నిలిచిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. నెల రోజులకు పైగా చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గం మూసివేయడం వల్ల భారత్ లో ఏర్పడిన ఎల్‌పిజి కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు, ప్రధాన పరిశ్రమలకు ఎల్‌పిజి కేటాయింపులను ఖరారు చేసింది. ప్రభుత్వం పారిశ్రామిక ఎల్‌పిజి సరఫరాలపై పరిమితులు విధించగా, గృహేతర ఎల్‌పిజిలో 70 శాతాన్ని రాష్ట్రాలకు కేటాయించింది. ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యం, అత్యవసర వినియోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పీఎన్‌జి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారేలా పరిశ్రమలను ప్రోత్సహించడం.
Also Read:Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..
Also Read
- IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
రాష్ట్రాలకు 70% గ్యాస్ కేటాయింపు
రాష్ట్రాలకు, వివిధ పారిశ్రామిక రంగాలకు ప్యాకేజ్డ్, బల్క్ కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల కేటాయింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ బుధవారం జారీ చేసిన ఒక లేఖ ప్రకారం, మొత్తం ఎల్‌పిజిలో 70% రాష్ట్రాలకు కేటాయించారు. ఇందులో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) ప్రోత్సాహానికి సంబంధించిన సంస్కరణల ఆధారంగా అదనంగా మరో 10% కూడా ఉంది. ప్రభుత్వ చర్యలో భాగంగా, పైప్డ్ గ్యాస్ (PNG) వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను చురుకుగా ప్రోత్సహించే రాష్ట్రాలకు ఈ అదనపు 10% LPG కేటాయింపు ఇవ్వనున్నారు. ముఖ్యంగా అటువంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో, LPGపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతోంది.
ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పాలిమర్స్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్స్, స్టీల్, మెటల్స్, సిరామిక్స్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గ్లాస్, ఏరోసోల్స్ వంటి అనేక రంగాలు, మార్చి 2026కు ముందు ఉన్న తమ సగటు వినియోగ స్థాయిలలో ఇప్పుడు కేవలం 70% మాత్రమే అందుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ సరఫరా రోజుకు 0.2 మెట్రిక్ టన్నులకు పరిమితం చేయబడుతుంది. ఇది పరిశ్రమలకు అందుబాటులో ఉండే మొత్తం పరిమాణాన్ని పరిమితం చేస్తుంది. అయితే, ఇంధనంగా ఎల్‌పిజిపై ఎక్కువగా ఆధారపడే పరిశ్రమలపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని అంచనా.
Also Read:Kadiri YSRCP Politics: కదిరి వైసీపీలో మూడు రెక్కలాట.. బాషా, మక్బూల్, పూల మధ్య గేమ్!
కేంద్రం నిర్ణయించిన కేటాయింపులో, పిఎన్‌జితో భర్తీ చేయలేని నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఎల్‌పిజిని ఉపయోగించే యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా, పరిశ్రమలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకుని పిఎన్‌జి కోసం దరఖాస్తు చేసుకోవాలి, కానీ ఎల్‌పిజిని నిత్యావసర ముడిసరుకుగా ఉపయోగించే చోట, పిఎన్‌జి దరఖాస్తు అవసరాన్ని మినహాయించారు. ఇది కాకుండా, పైప్‌లైన్ పంపిణీ ఉత్తర్వులు, సిబిజి విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
తాజావార్తలు
-
Vayu Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!