Windfall Tax: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. టన్నుకు రూ.6,700గా ఉన్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.10,000కు పెంచింది. అయితే డీజిల్ ఎగుమతిపై సుంకం గతంలో లీటరుపై రూ.6 ఉండగా, రూ.5.50కి తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)పై సుంకం గతంలో లీటరుపై రూ.4 నుండి రూ.3.50కి తగ్గించబడింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతకుముందు సెప్టెంబర్ 2న విండ్ ఫాల్ ట్యాక్స్ లో మార్పులు చేశారు.
విండ్ ఫాల్ పన్ను తగ్గింపు
ప్రభుత్వం సెప్టెంబర్ 2న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి పెట్రోలియంపై టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ ను స్వల్పంగా తగ్గించింది. అంతకుముందు జూలై 1, 2022న ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని విధించింది.
Read Also:Khairatabad Ganesh 2023: ప్రపంచ రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేష్
పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం
జూలై 1, 2022న ప్రభుత్వం పెట్రోల్, ఏటిఎఫ్‌పై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 13 ఎగుమతి సుంకం విధించింది. దేశీయ క్రూడాయిల్ విక్రయాలపై టన్నుకు రూ.23,250 విండ్ ఫాల్ ట్యాక్స్ విధించారు. అప్పటి నుంచి కేంద్రం అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా ప్రతి పదిహేను రోజులకోసారి లెవీని సమీక్షిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు
గ్లోబల్ స్థాయిలో కొంతకాలంగా ముడి చమురు ధర పెరుగుతోంది. చాలా దేశాలు ముడి చమురు ఉత్పత్తిని కూడా తగ్గించాయి. డబ్ల్యూఐ ముడి చమురు బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 94 డాలర్లుగా ఉంది. జూలై 1, 2022న ముడిచమురు అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించడం గమనార్హం. భారతదేశంతో పాటు, యూకే, ఇటలీ, జర్మనీతో సహా అనేక దేశాలు ఇప్పటికే ఇంధన సంస్థల సూపర్ నార్మల్ లాభాలపై విండ్‌ఫాల్ పన్ను విధించాయి.
Read Also:CWC Meeting:రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు