Uttam Kumar Reddy: కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల ఈ భేటీ సాగింది. ఈ అంశంపై తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని ప్రతిపాదించామన్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి.. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదని.. తదుపరి సమావేశం సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుందన్నారు.
READ MORE: T20 World Cup 2026: “పాకిస్తాన్ ఆడకుంటే, మేం ఆడుతాం”.. ICCని కోరిన మరో దేశం..
అనంతరం.. ఈ అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. “ఒక్క చుక్క నీరు కూడా వదులుకోం. ఢిల్లీలో జరిగిన మీటింగ్ గురించి హరీష్ రావు తెలుసుకుని మాట్లాడాలి.. మన నది జలాలను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చర్చలకు సిద్ధం.. కానీ చుక్క నీరు కూడా వదులుకునేది లేదు.. తెలంగాణ అధికారులు.. నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టడానికి ఒప్పుకోమని స్పష్టం చేశారు.. ఇంటర్ స్టేట్ ఇష్యూలు అజెండాలో పెట్టాలని కేంద్రానికి చెప్పారు. పోలవరం.. నల్లమల సాగర్ కి అనుమతి లేదని కేంద్ర మంత్రి నాకు నిన్న లేఖ రాశారు.. ఇవాళ జరిగిన మీటింగ్ లో కూడా సీడబ్ల్యూసీ ఇదే చెప్పింది.. పదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కట్టిన ప్రాజెక్టు కూలింది.. ఆ నాయకులు సిగ్గుపడాలి.. పదేళ్లలో slbc పూర్తి చేయలేదు.. డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదు.. పదే పదే అబద్ధాలు చెప్పి… నిజం చేయాలని అనుకుంటున్నారు.. పదేళ్ల లో కంటే… ఈ రెండేళ్లలో ఎక్కువ నీటి వినియోగం, వరి దిగుబడి వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.