TDP – Janasena – BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు ఖరారైన తర్వాత తొలిసారి కీలక భేటీ జరిగింది.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత బైజయంత్ పండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇక, బాబు నివాసంలో సుదీర్ఘంగా సాగిన చర్చలు.. దాదాపు ఎనిమిదిన్నర గంటల తర్వాత ముగిశాయి.. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నివాసం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా వెళ్లిపోగా.. ఇంకా, చంద్రబాబు నివాసంలోనే ప వన్ కల్యాణ్ చర్చలు జరుపుతున్నారు.. ఇక, చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు నివేదించారట గజేంద్ర షెకావత్. రేపు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also: Akkineni Nagarjuna: నాగార్జున రేర్ ఫ్యామిలీ ఫోటో.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా చై లేడెందుకు..?
అయితే, సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తే రేపు ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉందని చెబుతున్నారు.. ఈ రోజు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో.. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చించారట.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పవపై కూడా సమాలోచనలు జరిగాయట.. కేంద్ర పథకాల అనుసంధానంతో ఎలాంటి పథకాలను రూపొందించొచ్చనే అంశంపై సమీక్ష జరిగిందని చెబుతున్నారు. కొందరు ఉన్నతాధికారుల పని తీరు మీద భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఈ రోజు సుదీర్ఘంగా భేటీ జరిగినా.. అన్ని విషయాలపై స్పష్టత రాకపోవడంతో.. రేపు మరోసారి మూడు పార్టీల నేతలు భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.