నిధులు లేక కునారిల్లుతున్న పంచాయితీలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసింది. పంచాయితీ నిధుల విడుదల పై కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన ఏపీ సర్పంచులకు ఈమేరకు హామీ లభించింది. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన రెండవ విడత నిధులు 581 కోట్ల పంచాయితీ నిధులు త్వరలో విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
గ్రామ పంచాయితీ ఖాతాల్లోనే కేంద్రం నిధులు వేయాలని కేంద్రమంత్రిని కోరారు ఏపీ సర్పంచుల సంఘం ప్రతినిధులు. కేంద్ర పంచాయితీ నిధులు గ్రామాల్లో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. పంచాయతీల అభివృద్ధి పై కేంద్ర మంత్రి కీలక సూచనలు చేశారు. పంచాయితీ నిధులు విడుదల చేస్తామన్న కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపింది ఏపీ సర్పంచుల సంఘం. గ్రామాల్లో పంచాయితీ విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడం కోసం సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.
గ్రామాల్లో సెల్ ఫోన్ టవర్లకు పంచాయితీలు పన్నులు వసూలు చేయాలని కేంద్రమంత్రి సూచించారు. గ్రామ పంచాయితీకి ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రమంత్రి సూచనలు చేశారు. గ్రామ సమస్యలు,యువత,కేంద్ర రాష్ట్ర పథకాలు, సంక్షేమ అంశాలపై సభలు పెట్టుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. నిధులు లేక అల్లాడుతున్న తమకు కేంద్రమంత్రి హామీ ఉపశమనంగా వుందన్నారు ఏపీ సర్పంచుల సంఘం ప్రతినిధులు.
GO First Flight: గో ఫస్ట్ ఫ్లైట్ కు తప్పిన ముప్పు.. అత్యవసరంగా ల్యాండింగ్