దేశంలో ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది తన మొదటి స్థానాన్ని నిలుపుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్-2022ని ఈ ఏడాదికి విడుదల చేశారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్-2022 ర్యాకింగ్స్‌ను మొత్తం 11 విభాగాల్లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం, మేనేజ్‌మెంట్, కళాశాలలు, ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఏఆర్‌ఐఐఏ(అటల్ ర్యాకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అఛీవ్‌మెంట్స్).. ఈ విభాగాలుగా ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లోని విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు.
ఎన్‌ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌ను 11 విభాగాలుగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, మేనేజ్‌మెంట్, కాలేజీలు, ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఏఆర్ఐఐఏ (ఇన్నోవేషన్ ఆన్ అచీవ్‌మెంట్స్ ఆన్ ఇన్‌స్టిట్యూషన్స్ అటల్ ర్యాంకింగ్), లా అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఆ విభాగాలుగా ఉన్నాయి.
NTV Tech Talk: క్విక్సీ ఫౌండర్, సీఈవో గౌతమ్ నిమ్మగడ్డతో స్పెషల్ ఇంటర్వ్యూ
ఉత్తమ యూనివర్సీటీల జాబితాలో బెంగళూరు ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో 14వ స్థానంలో ఐఐటీ హైదరాబాద్.. 20వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 45వ స్థానంలో వరంగల్ నిట్, 46వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ నిలిచాయి. మొత్తంగా విద్యాసంస్థల జాబితాలో.. ఐఐటీ మద్రాస్ మొదటిస్థానంలో ఉండగా, ఐఐఎస్‌సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల పరంగా చూసుకుంటే.. ఐఐఎస్‌సీ బెంగళూరు, జేఎన్‌యూ, జామియామిలియా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. అలాగే ఐఐటీ మద్రాస్, ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలలని విద్యాశాఖ పేర్కొంది. ఫార్మసీ విభాగానికి వస్తే.. జామియా హమ్దార్డ్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ రెండో స్థానం పొందగా.. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీ మూడో స్థానంలో ఉంది.