బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేనేజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జులై 15లోగా అప్లై చేసుకోవాలి.. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. ఆ తర్వాత రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తారు..
అర్హతలు :
ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారి వయస్సు 2023, మే 31 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఇవి మిడ్ లెవెల్ మేనేజర్ పోస్టులు కాబట్టి దరఖాస్తుదారులకు ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా రూరల్ బ్యాంకింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన యువ అభ్యర్థులకు MS Office, ఈమెయిల్, ఇంటర్నెట్ స్కిల్స్ వంటి కంప్యూటర్ స్కిల్స్ అవసరం.. అప్పుడే ఇంటర్వ్యూ లో ప్రాధాన్యత ఉంటుంది..
ఎలా సెలెక్ట్ చేస్తారంటే?
మొదటగా ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి.. ఇందులో 100 మార్కులు ఉంటే జనరల్ వాళ్ళు కనీసం 50% మార్కులు రావాలి..SC/ST/OBC అభ్యర్థులు కనీసం 45% మార్కులు సాధించాలి. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), పీడబ్ల్యూబీడీ (PWBD), మహిళా అభ్యర్థులకు ఫీజు రూ.175 ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు నెలకు జీతం రూ.48,170 నుంచి రూ.69,810 పొందవచ్చు… ఇక మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఫిల్ చేసిన దరఖాస్తు ఫారమ్, KYC డాక్యుమెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్‌ను జులై 15 సాయంత్రం 5 లోగా ఈ-మెయిల్ అడ్రస్ rdpunero@centralbank.co.in కు మెయిల్ చెయ్యాలి.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..