Karnataka Elections : ఈ నెల 10న కర్ణాటక ఎన్నికలు.. సరిహద్దు రాష్ట్రాలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 10న రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరగనున్న కర్ణాటకతో సహా ఆరు దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కర్ణాటక రాష్ట్రానికి పూర్తి సహకారం అందించాలని సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను సీఈసీ ఆదేశించారు. ప్రతి సరిహద్దు రాష్ట్రం ద్వారా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేందుకు చేసిన ఏర్పాట్లను ECI సమీక్షించింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలను అరికట్టేందుకు చెక్‌పోస్టులను పెంచాలని, పెట్రోలింగ్‌ను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, మొబైల్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయాలి. బోగస్ ఓటర్ల పరిశీలన చేపట్టాలి.
Also Read : Off The Record: హాట్‌టాపిక్‌గా మారిన బాలినేని వ్యవహారం..! వైసీపీలో ప్రకంపనలు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ముఖ్యంగా పోలింగ్‌కు ముందు చివరి 72 గంటల సమయంలో కర్ణాటకకు ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఉంచాలి. సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపును నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘం సభ్యులకు వివరించారు. కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని సి.ఎస్ హామీ ఇచ్చారు. కర్ణాటక సరిహద్దు జిల్లాల నుండి తెలంగాణలోకి వ్యక్తుల రాకపోకలు, సామగ్రి తరలింపును పర్యవేక్షించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల చెక్ పోస్ట్ లు పెంచుతున్నామని, కట్టుదిట్టమైన నిఘా నిర్వహించబడుతుందని సీఎస్ పేర్కొన్నారు.
Also Read : Nora Fatehi: ఏవమ్మా .. మనోహరీ.. అసలే ఎండాకాలం.. నువ్వింకా హీట్ పెంచాలా
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!