Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌లో మంగళవారం జరిగిన ‘ది ఉమెన్స్ హండ్రెడ్ 2026’ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఉమెన్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ బ్యాటింగ్‌లో చెలరేగడంతో ‘ఎమ్ఐ లండన్’ పై సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని శుభారంభం చేసింది. మొదట బౌలర్లు లండన్ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయగా, అనంతరం బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టు ఆరంభం నుంచే లండన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. లండన్ ఓపెనర్లు హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్ మొదటి వికెట్‌కు 37 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాది వేశారు. అయితే భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వీరిద్దరినీ అవుట్ చేసి లండన్ జట్టును దెబ్బతీసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో అమెలియా కేర్ (13) తప్ప ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో లండన్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో డాని గిబ్సన్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ లీడ్స్ ఆరంభంలోనే ఓపెనర్ బ్రయోనీ స్మిత్ వికెట్ కోల్పోవడంతో పాటు జెస్ జోనాస్సెన్ రనౌట్ కావడంతో కాస్త కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో ఆస్ట్రేలియన్ జోడీ ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అన్నాబెల్ సుథర్లాండ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 36 బంతుల్లోనే 57 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
లిచ్‌ఫీల్డ్ తనదైన శైలిలో మైదానం నలుమూలలా వినూత్నమైన షాట్లతో విరుచుకుపడింది. ఆమె కేవలం 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పేసింది. మరోవైపు సుథర్లాండ్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు మరో 31 బంతులు మిగిలి ఉండగానే, 69 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!