AI Based Laptops: హెచ్‌పి సంస్థ తమ అత్యంత శక్తివంతమైన AI ఆధారిత HP EliteBook Ultra, HP OmniBook X ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు కార్పొరేట్స్, స్టార్టప్‌లు, రిటైల్ కస్టమర్ల కోసం అధునాతన కంప్యూటింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ నూతన ల్యాప్‌టాప్‌లు Snapdragon X Elite ప్రాసెసర్లు, డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)6 తో వస్తున్నాయి. వీటిలోని NPU సెకనుకు 45 ట్రిలియన్ ఆపరేషన్లను నిర్వహించగల సామర్థ్యంతో ఉంటే, లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ AI ను లోకల్‌గా రన్ చేయగలుగుతాయి.
Also Read: New Year 2025: నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.. క్రాకర్ పేలి వ్యక్తి మృతి!
ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా బిజినెస్ లీడర్ల కోసం డిజైన్ చేయబడింది. వారికి స్టైలిష్, మొబైల్ డివైస్ అవసరం ఉన్నప్పుడు ఇది అత్యుత్తమం. ఇది సొగసైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీతో ప్రపంచంలోనే అత్యంత సన్నని ల్యాప్‌టాప్‌గా నిలిచింది. ఇందులో ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ ఎండ్‌పాయింట్ సెక్యూరిటీ కలిగి ఉండి, డేటాను సురక్షితంగా ఉంచుతుంది.
Also Read: Ram Charan : గేమ్ ఛేంజర్ ఒకటి కాదు.. రెండు ట్రైలర్స్ ప్లానింగ్..?
HP OmniBook X:
ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు వంటి రిటైల్ కస్టమర్ల కోసం రూపొందించబడింది. ఇందులో ఉన్న అధునాతన AI ఫీచర్లు వీడియో క్వాలిటీ, అనుభవాలను మెరుగుపరుస్తాయి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, రిమోట్ మీటింగ్స్ వంటి డైనమిక్ జీవనశైలిని మద్దతు ఇవ్వడానికి అవసరమైన శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. హెచ్‌పి ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఇప్సితా దాస్‌గుప్తా మాట్లాడుతూ, మేము AI లాప్ టాప్స్ కొత్త యుగానికి దారితీస్తున్నామని, ఇది వ్యక్తిగత కంప్యూటర్ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుందని అన్నారు.